చదువరులను ఆలోచింపజేసే..మానవ సంబంధాలను..నైతిక విలువల్ని పెంపొందించే మానవీయ అంశాలతో మంచి కథలు, కవితలు, నవలలు, ఇతర రచనలు మీ నుంచి కోరుతున్నాము.
మీరు మాకు పంపే రచనలు ఇదివరకు ఎక్కడా ప్రచురితమై ఉండకూడదు. ముద్రణలో కానీ, వెబ్ లో కానీ, సోషల్ మీడియాలలో, వివిధ వాట్సాప్, టెలిగ్రాం గ్రూపుల్లో కానీ ఆ రచన ఇదివరకు ఎక్కడ ప్రచురింపబడలేదని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. మీ స్వంత రచన అని, దేనికి అనుసరణ గానీ అనువాదం గానీ కాదని కూడా మీ హామీ పత్రంలో రాయాలి. మీ ఫోటో, సరైన ఫోన్ నంబర్ కూడా పంపాలి. మీ ప్రతి రచన కు చివరగా మీ పేరు, చిరునామాలతో పాటుగా మీ బాంక్ అకౌంట్ వివరాలను కూడా ఇవ్వండి.
మీ రచనలు వీలైనంతవరకు యూనికోడ్ లో పంపండి. లేదా పేజ్ మేకర్ డాక్యుమెంట్ (అను7)లో ఇమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపాలి. చేతిరాతలతో ఉన్నవి, స్కాన్ చేసి పంపినవి పరిశీలించలేము. మాకు రచనని పంపే ముందు మీరే నిశితంగా పరిశీలించి అక్షర దోషాలు సవరించి పంపగలరు. మీ రచనల కాపీరైట్ విషయంలో పూర్తి బాధ్యత మీదే అని గుర్తించాలి. మీ రచనలు మాకు చేరిన తర్వాత నెలరోజుల వ్యవధిలోగా పరిశీలించి ప్రచురణకు ఎంపిక చేస్తాము. అంతవరకూ నిరీక్షించకుండా పదేపదే ఫోన్లు చేయవద్దని విజ్ఞప్తి.
పాఠకులకు అత్యంత నాణ్యమైన రచనలను అందించడంలో మీ కృషి అమూల్యమైనదిగా భావిస్తాము. ప్రచురించిన ప్రతి రచనకు మా నిబంధనల మేరకు పారితోషికం ఉంటుంది. ఈ పారితోషికం మీ రచన ప్రచురించిన తర్వాత ఆ నెలలోగా మీకు అందుతుంది.