Nithya Monthly

Blog

Welcome to our blog!

శ‌త‌వ‌సంతాల చైత‌న్య వార‌ధి.. కొండ‌పల్లి కోటేశ్వ‌ర‌మ్మ‌

శ‌త‌వ‌సంతాల చైత‌న్య వార‌ధి.. కొండ‌పల్లి కోటేశ్వ‌ర‌మ్మ‌

జ్ఞాపకాలు కొందరికి నిట్టూర్పులు, మరికొందరికి మధురానుభూతులు. కానీ ఆమెకు నిత్య చైతన్య దీపికలు. ఊహ తెలిసిన నాటి నుంచీ నేటి వరకూ ఎన్నో ప్రజా ఉద్యమాల దారుల్లో పయనమామెది… ఉద్యోగమో, కాస్తంత ఆర్థిక ప్రయోజనమో, లేదా ప్రభుత్వ అవార్డో చేతికందిన తర్వాత అప్పటివరకూ ఆవేశంగా చెప్పే ఆదర్శాలను చాలామంది అటకమీదకి నెట్టేస్తున్న రోజులివి. ఇలాంటి వాటికి భిన్నంగా తనకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చలించని ధీరత్వంతో, స్ఫూర్తితో జీవితాన్ని ఆదర్శంగా నిలిపిన సాహస మానవి కొండపల్లి కోటేశ్వరమ్మ….

అప్పటి ‘దేవ శిశువు’ – ఇప్పటి ‘శిశు దేవత’

అప్పటి ‘దేవ శిశువు’ – ఇప్పటి ‘శిశు దేవత’

ఇంటి కోడలిని దేవి అవతారం అని ఒక మామగారు ఖరారు చేస్తారు. ఆ దేవి పాదాల చెంత పెట్టిన రోగగ్రస్త శిశువు యాధృచ్చికంగా నయమౌతుంది. అంతే! ఆమె అపర దేవతగా జనులందరిచేతా నీరాజనాలందుకుంటుంది. చదువు ముగించుకుని ఇంటి కొచ్చిన భర్తకు ఈ వేలం వెర్రి చిరాకు తెప్పిస్తుంది. తన భార్యను ‘నార్మల్’ చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆమె కూడా తను దేవతనేనని గాఢంగా నమ్మడంతో ఫలితం కనిపించదు. కానీ సొంతింటి బిడ్డను తన దైవశక్తి నయం…

కళా సైనికుడు గరికపాటి

కళా సైనికుడు గరికపాటి

కళ కళకోసం కాదనీ, కళ ప్రజలకోసమనీ, కళ మానవ జీవన గమనానికి వెలుగుబాటలు చూపించే ఒక ప్రగతిశీల సాధనమని చెప్పి… నాటకరంగం ద్వారా ప్రజాకళారంగానికి దిక్సూచిగా నిలచిన వైతాళికుడు డాక్టర్‌ గరికపాటి రాజారావు. తెలుగు నాటకరంగంలో అతి నవీన భావాలతో వినూత్న విలువలను ఆవిష్కరించి తెలుగు నాటక దశను, దిశను మార్చి సామాన్య ప్రజల సాంస్కృతిక సైనికుడిలా నిలచిన కళాస్రష్ట ఆయన. రాజమండ్రిలో 1915 ఫిబ్రవరి 5వ తేదీన గరికపాటి సోమయ్య దేవర, సోమలింగమ్మ దంపతులకు రాజారావు…

అమ్మ ఆది గురువు (కవిత)

అమ్మ ఆది గురువు (కవిత)

నవమాసాలు కడుపున మోసి నరకపు ప్రసవ వేదన నిండిన నొప్పులు పంటిబిగువున దాచి లోకాన్ని పరిచయం చేసి తన రుధిరాన్ని స్తన్యంగా అందించి గోరు ముద్దలు అందించి ఆకలి తీర్చి పడుతూ లేస్తూ అడుగులు మొదలెడిన నాకు తన చేయందించి అడుగులు నేర్పిన తల్లి ఆది గురువు కాదా ఎనిమిదేళ్ళ వయసప్పుడు ఎదురింటి పెరట్లో నోరూరించిన జామకాయలు దొంగిలించి తెలియక చేసిన తప్పుకు అమ్మ కొట్టిన దెబ్బతో ఎర్రగ కందిన నా పసి చెంప పై జారిన…

error: Content is protected !!