Nithya Monthly

about

మేము

అక్షర ప్రేమికులకు నిత్య అభివందనాలు

అక్షరం..నిత్య నూతనంగా పరిమళించాలంటే… మస్తిష్కాలు వివేకవంతమైన ఆలోచనలతో వికసించాలంటే అధ్యయనం తప్పనిసరి. ఒకప్పుడు పత్రికలు ఆ లోటుని కొంతవరకూ తీర్చాయి. అన్ని రంగాల్లాగే పత్రికారంగం కూడా ప్రపంచీకరణ ప్రభావానికి లోనవడంతో తెలుగువారికి వెలుగుదారులు చూపిన ఎన్నో పత్రికలు కళ్ళముందే కనుమరుగయ్యాయి. ముద్రణ, నిర్వహణ వ్యయం భారీగా పెరిగిపోవడం, పెట్టుబడిదారులతో పోటీ పడలేకపోవడం వల్ల కొన్ని దశాబ్దాల కింద స్వర్ణ యుగంలా పాఠకుల ఆదరణని పొందిన పత్రికలు ఒకటొకటిగానే మూతపడ్డాయి… మూతపడుతున్నాయి. ఈ క్రమంలోనే 2020 నుంచి కోవిడ్ 19 మహమ్మారి దెబ్బకు ప్రింటులో వస్తున్న చాలా పత్రికలు కనుమరుగయ్యాయి.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన విప్లవం వల్ల డిజిటల్ మీడియా ఊపందుకుంది. ఎన్నో ఏళ్ళుగా ముద్రణలో ఉన్న దినపత్రికలు, ఇతర కాలిక పత్రికలు అనివార్యంగా డిజిటల్ మీడియాలోకి రాకతప్పని పరిస్థితి ఏర్పడింది.

నేటి పాఠకలోకానికి సామాజిక అవగాహన, ఆలోచనా చైతన్యాన్ని అందించేందుకు తగిన ప్రయత్నం చేయాలన్న నిబద్దతతో నిత్య రూపుదిద్దుకుంది. పాఠకులకు నాణ్యమైన మంచి రచనలు అందించే లక్ష్యంతో మీ ముందుకి వచ్చింది
నిత్య ఇ- మాసపత్రీక

ప్రతినెలా ఒక పూర్తి నవలతో పాటే ఇంతవరకూ ఏ పత్రిక కూడా ఇవ్వలేనన్ని కథలు, కవితలు, ప్రత్యేక శీర్షికలతో మీ ముందుకు వస్తోంది..మీ నిత్య….

నిత్యకు ఎలాంటి సరిహద్దులు లేవు…ప్రపంచంలో ఏ మూల ఉన్నా మీ అరచేతిలో ప్రత్యక్షమయ్యే నిత్యని నిత్యం ఆదరిస్తారని కోరుకుంటూ

మీ
నిత్య
ఇ- మాసపత్రిక

error: Content is protected !!