Nithya Monthly

తపఃఫలం

బుద్ధుని దగ్గరకు వచ్చిన ఒక యోగి.. ”భగవాన్! నేను ఆరు నెలలు తపస్సు చేసి నీటిలో మునిగిపోకుండా ఉండే శక్తులు సంపాదించాను అన్నాడు. ”అలాగా! ఏదీ నీ శక్తులు చూపించు” అన్నాడు బుద్ధుడు. ఆ యోగి ఆ పక్కనే ఉన్న నది నీటి మీద నడుస్తూ ఈ దరి నుంచి ఆ దరికి వెళ్లి గర్వంగా నిలబడ్డాడు.
“మళ్లీ వెళ్లిరా!” అన్నాడు బుద్ధుడు. భగవాన్ ! మళ్లీ రావాలంటే మరో ఆరు నెలలు తపస్సు చేయాలి అన్నాడు. చూశావా! ఎంత అజ్ఞానంలో ఉన్నావో! ఒక్క రూక ఇస్తే పడవ మీద వెళ్లి రాగలిగిన పనికి ఆర్నెల్లు వృథా చేస్తున్నావు. అయినా మనం మునిగి పోకుండా ఉండాల్సింది నీటిలో కాదు.
కామం, క్రోధం, ధన వ్యామోహం, లోభం, మద మాత్సర్యాలు, అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అనే అమానవీయ విషయాల్లో మునిగిపోకూడదు. వాటిలో మునక్కుండా ఉండేందుకు మన శక్తియుక్తుల్ని వినియోగించాలి. అదే సరైన యోగం, ధ్యానం అన్నాడు బుద్ధుడు. ఆ యోగికి జ్ఞానోదయమై బుద్ధుణ్ని అనుసరించాడు….

Previous Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!